యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ గా అల్టిమేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో అని చెప్పాలి. బాహుబలి తో వచ్చిన క్రేజ్ ని సాహో లాంటి డిసాస్టర్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమా తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని దక్కించుకుని తన క్రేజ్ పవర్ ఏంటో చూపాడు ప్రభాస్.. ఇప్పుడు సాహో తర్వాత…
రాధే శ్యామ్ అంటూ క్లాస్ లవ్ స్టొరీ చేస్తున్న ప్రభాస్ ఈ లవ్ స్టొరీ తోనే సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉండటం విశేషమని చెప్పొచ్చు. సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ పరిస్థితుల వలన మరింత ఆలస్యం కానున్న ఈ సినిమా…
డైరెక్ట్ రిలీజ్ కోసం భారీ రేట్లు ఆఫర్ చేశాయి లీడింగ్ OTT జైంట్స్… కానీ మేకర్స్ నో చెప్పగా జస్ట్ పోస్ట్ రిలీజ్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ బిజినెస్ రీసెంట్ గా క్లోజ్ అయిందని తెలుస్తుంది. సినిమా ను జీ నెట్ వర్క్ వాళ్ళు వదలకుండా రైట్స్ కోసం ట్రై చేసి…
ఇప్పుడు ఏకంగా ఇండియా లో సెకెండ్ బిగ్గెస్ట్ పోస్ట్ రిలీజ్ డిజిటల్ రేటు అండ్ శాటిలైట్ రైట్స్ తో కలిపి సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా 325 కోట్ల రేటు ని పోస్ట్ రిలీజ్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా సొంతం చేసుకోగా రాధే శ్యామ్ సినిమా పోస్ట్ రిలీజ్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్….
జీ నెట్ వర్క్ వాళ్ళు 190 కోట్ల రేటు కి సొంతం చేసుకోగా హిందీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ వాళ్ళు 40 కోట్ల రేటు కి సొంతం చేసుకున్నారట. రెండూ కలిపి సినిమా పోస్ట్ రిలీజ్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 230 కోట్ల రేటు కి క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇండియా లో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ రేటు. ఒక క్లాస్ లవ్ స్టొరీ తో ఈ రేంజ్ రాంపేజ్ అంటే ప్రభాస్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.