Home న్యూస్ RRR కొత్త పోస్టర్…. సాలిడ్ షాకిచ్చిన మేకర్స్…రీజన్ ఇదే!!

RRR కొత్త పోస్టర్…. సాలిడ్ షాకిచ్చిన మేకర్స్…రీజన్ ఇదే!!

0

టాలీవుడ్ లో ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో అందరూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్…. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందున్న ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ కోసం ఆల్ మోస్ట్ మూడేళ్ళు గా అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఎప్పటికప్పుడు ఎదో ఒక కారణం వలన…

ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఈ ఇయర్ సంక్రాంతి కి రావాల్సిన సినిమా ఫస్ట్ వేవ్ వలన సెకెండ్ ఆఫ్ అక్టోబర్ కి షిఫ్ట్ అవ్వగా ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మరింత ఆలస్యం కాబోతుంది అన్న వార్తలు టాలీవుడ్ మొత్తం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా సినిమా ఇక ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఏమాత్రం లేనట్టే అని, వచ్చే సంక్రాంతి కి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ గట్టిగా వినిపించడం మొదలు అవ్వగా మేకర్స్ ఈ విషయం పై పెద్దగా స్పందించలేదు…

కానీ ఈ మధ్య రిలీజ్ అయిన కొత్త పోస్టర్స్ లో అక్టోబర్ 13 డేట్ ని అలానే ఉంచారు, కానీ పోస్ట్ పోన్ వార్తలు గత కొన్ని రోజులుగా మరింతగా చక్కర్లు కొడుతున్న టైం లో ఇక సినిమా రిలీజ్ డేట్ మారడం ఖాయమని అని అనుకుంటున్న సమయంలో రీసెంట్ గా సినిమా లో మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరూ…

బైక్ పై కూర్చుని వెళుతున్న పోస్టర్ ఇటు మెగా అటు నందమూరి ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో థ్రిల్ చేయగా పోస్టర్ లో సినిమా ఇంకా అక్టోబర్ 13 నే వస్తుంది అన్నట్లు ఆ డేట్ నే పెట్టారు. అప్పటికి థార్డ్ వేవ్ వస్తుంది అంటున్నా అదే డేట్ ని ఇంకా చెబుతూ పోస్ట్ పోన్ కన్ఫాం అనుకున్న వాళ్లకి షాకిచ్చారు మేకర్స్… మరి ఎట్టి పరిస్థితులలో ఆ డేట్ కే వస్తారా లేక అప్పటికి నిర్ణయం మార్చుతారో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here