మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కంబ్యాక్ ని ఈ ఇయర్ క్రాక్ సినిమా తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ 3 ఏళ్లుగా వరుస ఫ్లాఫ్స్ ని 4 సినిమాలుగా ఎదురు కుంటున్న రవితేజ ఎట్టకేలకు క్రాక్ తో క్రాకింగ్ కంబ్యాక్ ని దక్కించుకుని కెరీర్ లోనే నంబర్ 1 మూవీ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ చేసిన కొత్త సినిమా ఖిలాడీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ లేకుండా ఉండి ఉంటే ఈ పాటికే సినిమా దుమ్ము లేపి ఉండాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా డిజిటల్ రిలీజ్ కోసం భారీ ఆఫర్స్…
ఒకటి తర్వాత ఒకటి రాగా నిర్మాత కలగజేసుకుని సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆఫర్స్ రావడం మాత్రం ఆగలేదట. ఏకంగా రేటు 42 కోట్ల రేంజ్ కి వెళ్ళగా ఆ ఆఫర్ కి కూడా నో చెప్పారు, కానీ రీసెంట్ గా రేటు ని ఇంకాస్త పెంచి…
ఇప్పుడు రౌండ్ ఫిగర్ 45 కోట్ల రేటు ఇవ్వడానికి కూడా సిద్ధం అన్నట్లు చెబుతున్నారట. ఇంత రేటు కి కారణం సినిమా డిజిటల్ రైట్స్ కొంటే సౌత్ భాషలతో పాటు హిందీ లో కూడా డబ్ చేసి ఒకే టైం లో డిజిటల్ రిలీజ్ చేయొచ్చని ప్లాన్ అని తెలుస్తుంది, కానీ రవితేజ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ సెపరేట్ గా సాలిడ్ రేటు సొంతం చేసుకుంటాయి కాబట్టి…
ఈ సారి ఏకంగా రవితేజనే రంగం లోకి దిగి సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ ను సొంతం చేసుకుంటుందని కన్ఫాం చేశారట. దాంతో చేసేదేమీ లేక వెనక్కి తగ్గాయి అట OTT వాళ్ళు. ఇక సినిమా పరిస్థితులు నార్మల్ అయిన వెంటనే ఆడియన్స్ ముందుకు వచ్చే సినిమాల్లో ముందు నిలుస్తుంది అని సమాచారం.