మాచో హీరో గోపీచంద్ నయనతార ల కాంబినేషన్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్ లో ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితమే మొదలు అయ్యి 4 ఏళ్ల క్రితమే ఆడియన్స్ ముందుకు రావాల్సిన సినిమా ఆరడుగుల బుల్లెట్… మంచి స్టార్ కాస్ట్ తో కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ పరిస్థితులు అడ్డుగా నిలుస్తూ సినిమా…
రిలీజ్ పై ఎఫెక్ట్ చూపుతూ సినిమాను ఆడియన్స్ ముందుకు రాకుండా చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ లో కూడా డిజిటల్ రిలీజ్ కోసం ట్రై చేసినా కానీ రేటు అనుకున్న విధంగా రాక పోవడం అలాగే వచ్చిన రేటు తో నిర్మాత సంతోషంగా లేక పోవడం తో…
సినిమా రిలీజ్ మళ్ళీ మళ్ళీ ఆగిపోతు ఉంటుంది, లేటెస్ట్ గా సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం మరోసారి 10 కోట్ల రేంజ్ ఆఫర్ వస్తే మేకర్స్ నో చెప్పగా తర్వాత రేటు తగ్గించేశారు, కేవలం 6 కోట్ల రేటు ఇస్తామని చెప్పడం తో మేకర్స్ కి చిర్రెత్తుకొచ్చింది.
దాంతో ఇప్పుడు మేకర్స్ OTT వాళ్లకి శాకిస్తూ సినిమాను ఇక డైరెక్ట్ రిలీజ్ చేయమని, థార్డ్ పార్టీ బయర్స్ తో లాభమో నష్టమో థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యామని చెప్పారని సమాచారం. ఆల్ రెడీ అగ్రిమెంట్స్ కూడా మొదలు అయ్యాయని చెప్పారట. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వాలు చెప్పినా పరిస్థితులు ఇంకా కంప్లీట్ గా నార్మల్ అవ్వాల్సి ఉండగా…
నార్మల్ అయ్యాక సినిమాలను వెంటనే రిలీజ్ చేయరు కాబట్టి ఆ టైం లో సినిమాకి మంచి పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ముందుకు తెస్తే జనాలు వచ్చి చూసే అవకాశం ఉంటుందని నిర్మాత భావిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.