Home గాసిప్స్ ఎపిక్ మూవీ కి 150 కోట్లు…విజువల్ వండర్….కాచుకోండి ఇక!

ఎపిక్ మూవీ కి 150 కోట్లు…విజువల్ వండర్….కాచుకోండి ఇక!

0

టాలీవుడ్ లో 2010 టైం లో వచ్చిన సినిమాల్లో ఓ డబ్ మూవీ కి మంచి హైప్ వచ్చింది, హీరో ఎవరో కొత్త కుర్రాడు, టోటల్ గా తమిళ్ ఫ్లేవర్ అయినా కానీ ఆడియన్స్ ఆ సినిమా ని ఇక్కడ ఆదరించారు, అది కూడా ఓన్ తమిళ్ భాష కి మించి తెలుగు లో విజయాన్ని కట్టిపెట్టారు. ఆ సినిమానే సూర్య తమ్ముడు కార్తి నటించిన యుగానికి ఒక్కడు మూవీ. సోషియో ఫాంటసీ కథ నే అయినా కానీ…

సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఈ సినిమా అడ్వెంచర్ జానర్ గా కథ ని ఓ రేంజ్ లో తెరకెక్కించాడు. అప్పుడు తమిళ్ వాళ్ళకి ఎక్కలేక పోయిన ఈ సినిమా తర్వాత వాళ్ళ దృష్టి లో ఓ క్లాసిక్ ఎపిక్ మూవీ గా నిలిచిపోయింది, కార్తికి తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది.

సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తీ అవ్వగా ఇప్పుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ ఎపిక్ క్లాసిక్ అడ్వెంచర్ మూవీ కి సీక్వెల్ ప్లాన్ చేశాడు….. మొదటి సినిమా 32 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తీస్తే ఈ సినిమా కి 150 కోట్ల రేంజ్ బడ్జెట్ అవసరం అనడంతో ప్రాజెక్ట్ మొదలు అవుతుందా లేదా అన్న డౌట్ ఉండేది…

తమిళ్ లో పెద్దగా వర్కౌట్ కాని సినిమా తెలుగు లో మాత్రం 4.5 కోట్ల బిజినెస్ 6 కోట్లకు పైగా షేర్ అందుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. కాగా రీసెంట్ గా తన మార్కెట్ ని ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ దాకా ఇంప్రూవ్ చేసుకున్న కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేయడం తో భారీ బడ్జెట్ తో సినిమా సీక్వెల్ కన్ఫాం అయిపొయింది అని చెప్పొచ్చు.

ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ మూవీ లో కార్తీ ప్లేస్ లో ఇప్పుడు ధనుష్ రాబోతుండగా ఒక ఏడాది మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుని ప్రేక్షకుల ముందుకు 2024 లో రాబోతుందని డైరక్టర్ అనౌన్స్ చేశాడు. మొదటి పార్ట్ ని మించే ఎపిక్ అడ్వెంచర్ అంటున్న ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here