సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఆల్ మోస్ట్ 3 నెలల నుండి కొనసాగుతుంది. ఇండియా లో థియేటర్స్ ఈ నెల ఎండ్ టైం కి అన్ని చోట్ల ఓపెన్ అయ్యే అవకాశం ఉండగా కొత్త సినిమాలు అన్నీ కూడా ఆగస్టు లో క్యూ కట్టే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో చాలా లొకేషన్ లు ఆల్ రెడీ ఓపెన్ అయినా కానీ సరైన సినిమాలు లేక పోవడం అలాగే 50% లిమిటేషన్ లు ఉండటం తో….
అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రావడం లేదు, రీసెంట్ గా రిలీజ్ అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చాలా వరకు జనాలను తిరిగి థియేటర్స్ వైపు తీసుకు వచ్చింది అని చెప్పాలి. ఇక రీసెంట్ గా మరో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన బ్లాక్ విడో సినిమా….
అమెరికాలో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఇండియా లో పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ద్వారా డిజిటల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా అమెరికాలో ఫస్ట్ డే నే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.
ప్రీమియర్ షోలతో ఈ సినిమా 13.2 మిలియన్ డాలర్స్ ని సొంతం చేసుకోగా ఫస్ట్ డే తో కలిపి టోటల్ గా 39.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇండియన్ కరెన్సీ లో ఈ లెక్క ఆల్ మోస్ట్ 292 కోట్ల రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన…
కలెక్షన్స్ లెక్కలు రిలీజ్ అవ్వాల్సి ఉండగా సినిమా ఇంకా భారీ వసూళ్ళని సొంతం చేసుకుని ఉంటుందని సమాచారం. వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ లెక్కలు మరింత క్లారిటీగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఇండియా లో థియేటర్స్ లో ఈ సినిమా నెల ఎండ్ వరకు లేదా వచ్చే నెలలో రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.