Home న్యూస్ తమిళ్ లో వకీల్ సాబ్….ఇదెక్కడి షాక్ రా బాబు!!

తమిళ్ లో వకీల్ సాబ్….ఇదెక్కడి షాక్ రా బాబు!!

3566
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ కి ఆల్ మోస్ట్ 3 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ మూవీ కాగా సినిమా రీమేక్ అయినా ఎక్స్ పెరిమెంటల్ కాన్సెప్ట్ అయినా కానీ హైప్ కమర్షియల్ మూవీస్ రేంజ్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి రోజు నుండే…

Vakeel Saab 12 Days Total World Wide Collections

అనేక అవరోధాలను సొంతం చేసుకున్నప్పటికీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుని దుమ్ము లేపగా తర్వాత సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగా పడటం తో పరుగును అర్ధంతరంగా ఆపాల్సి వచ్చినా కానీ అప్పటికే సాధించిన కలెక్షన్స్ తో సెమీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాలీవుడ్ పింక్ రీమేక్ అన్న విషయం తెలిసిందే…

Vakeel Saab 14 Days Total World Wide Collections

ఇదే సినిమాను కోలివుడ్ లో టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ నేర్కొండ పార్వాయిగా రీమేక్ చేయగా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది, ఈ సినిమా తెలుగు లో డబ్ అవ్వాల్సింది కానీ రీమేక్ ఉండటం తో రిలీజ్ ను ఆపేశారు. కానీ ఇదే టైం లో…

ఇప్పుడు రన్ ని కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని మాత్రం తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా తమిళ్ డబ్బింగ్ వర్షన్ రానుండగా త్వరలో టెలివిజన్ లో కూడా ఈ సినిమా టెలికాస్ట్ కాబోతుందట. ఎక్కువ శాతం ఇలాంటివి తెలుగు లో జరుగుతూ ఉంటాయి.

కొన్ని సినిమాలు తెలుగు లో రీమేక్ అయినా ఒరిజినల్ లు తర్వాత మళ్ళీ తెలుగు లో డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు, తెలుగు నుండి తమిళ్ లో రీమేక్ అయినా అవి తిరిగి తెలుగు లో డబ్ అవ్వడం కామనే… కానీ ఈ మధ్యకాలంలో వకీల్ సాబ్ ఫస్ట్ టైం అక్కడ నుండి ఇక్కడ కొన్ని మార్పులతో రీమేక్ అయినా తిరిగి అక్కడ డబ్ అయ్యి టెలికాస్ట్ అవుతుండటం విశేషం. అక్కడ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇక.

Vakeel Saab 15 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here