మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా తో ఈ ఇయర్ అద్బుతమైన కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ వరుస పెట్టి సినిమాలను కమిట్ అవ్వడం మొదలు పెట్టగా ముందుగా ఖిలాడీ సినిమా తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న రవితేజ ఈ సినిమా షూటింగ్ ను ఆల్ మోస్ట్ ఫినిష్ చేయగా ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడు శరత్ డైరెక్షన్ లో రామారావ్ ఆన్ డ్యూటీ అంటూ….
కొత్త సినిమాను కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుండే మంచి అంచనాలను ఆడియన్స్ లో క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా స్టొరీ పాయింట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సినిమా లో రవితేజ…
చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించబోతున్నారని అంటున్నారు… ఇది మైనింగ్ మాఫియా, ఎర్రచందనం స్మగ్లర్లను ఆట కట్టించే అధికారిగా రవితేజ రోల్ ఉంటుందని… కథ మొత్తం వీటి చుట్టే తిరిగుతుందని కానీ రవితేజ రోల్ కి చాలా ట్విస్ట్ లు ఉంటాయని అంటున్నారు…
వీటి తో పాటు మరో ఆసక్తి కరమైన లీక్ ఏంటంటే ఇందులో రవితేజ రోల్ కి కొంచం నెగటివ్ టచ్ కూడా ఉంటుందని అంటున్నారు. అప్పటి వరకు హీరో అనుకుంటే తనే విలన్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ ఉంటుందని టాక్ ఉంది కానీ వీటి పై ఇంకా నిజా నిజాలు తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ సినిమా కోసం కేవలం 30 వర్కింగ్ డేస్ ని మాత్రమె…
కేటాయించిన రవితేజ తక్కువ టైం లోనే ఈ సినిమాను పూర్తీ చేసే అవకాశం ఉంది. చిత్తూరు యాసతో రవితేజ డైలాగ్స్ ఈ సినిమా కి మేజర్ హైలెట్ అవుతాయని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ ఇక బాక్ టు బాక్ మూవీస్ తో మళ్ళీ ఇయర్ కి రెండు మూడు సినిమాలు మినిమం చేసేలా ప్లాన్ చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.