ఒక భాషలో హిట్ అయిన సినిమా వస్తే వెంటనే ఆ సినిమా రీమేక్ రైట్స్ ని తీసుకుని రీమేక్ చేయడం ఒరిజినల్ వర్షన్ ని రీమేక్ చేస్తున్న చోట అందుబాటులో లేకుండా చూసుకోవడం అప్పుడప్పడు జరుగుతూ ఉంటుంది. అలా చేస్తే ఒరిజినల్ అందుబాటులో ఉండదు కాబట్టి రీమేక్ పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు డిజిటల్ టైం లో ప్రతీ సినిమా ఎదో ఒక ప్లాట్ ఫాంలో అందుబాటు లో ఉన్న టైం లో…
రీమేక్ లు కత్తిమీద సాములా మారాయి. ఇలాంటి టైం లో కూడా రీమేక్ లు చేస్తూనే ఉన్నారు ఎక్కువ మంది. కన్నడ లో ఈ మధ్య మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టొరీ “దియా”… ఈ సినిమా కథ పాయింట్ చాలా వరకు మన దగ్గర…
వచ్చిన అందాల రాక్షసి సినిమా కథని పోలి ఉంటుంది కానీ ట్రీట్ మెంట్ కొంచం కొత్తగా ఉంటుంది, క్లైమాక్స్ అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి తెలుసుకుని ఎగబడి చూశారు తెలుగు ఆడియన్స్.
అయినా కానీ తెలుగు నేటివిటీకి సెట్ అయ్యే స్టొరీ అని తెలుగు రీమేక్ హక్కులను తీసుకుని మేఘా ఆకాష్ తో ఈ సినిమాను “డియర్ మేఘా” అంటూ రీమేక్ చేయగా అతి త్వరలో థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా కి శాకిస్తూ రీసెంట్ గా ఒరిజినల్ వర్షన్ తెలుగులో డబ్ చేసి ఈ నెల 19 న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఈ విషయాన్నీ రీసెంట్ గా పోస్టర్స్ లో కన్ఫాం చేయగా ఈ విషయం తెలుసుకున్న మేకర్స్… ఇప్పుడు లబోదిబో అంటున్నారు. తెలుగు లో డబ్ చేయాలి అనుకున్నప్పుడు రీమేక్ రైట్స్ ఎందుకు అమ్మారు అన్నది తెలియాల్సి ఉండగా ఇప్పుడు ఒరిజినల్ ని రిలీజ్ చేస్తే రీమేక్ ని ఎవరు చూస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.