Home న్యూస్ టాలీవుడ్ లో ఫస్ట్ టైం…ఓ చిన్న సినిమా కి ఇలా జరగడం!

టాలీవుడ్ లో ఫస్ట్ టైం…ఓ చిన్న సినిమా కి ఇలా జరగడం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే సినిమాల కలెక్షన్స్ లెక్కలు అన్నీ కూడా నార్మల్ గా ఏ రోజువి ఆ రోజు ట్రేడ్ కి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీస్ నుండి థియేటర్స్ ఓనర్స్ నుండి రిలీజ్ అవ్వడం అన్నది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు నిర్మాతలు సినిమాల కలెక్షన్స్ కి ఆడియన్స్ కి తెలియకుండా కొన్ని సార్లు రోజు వారి లా కాకుండా వీకెండ్ కి, వీక్ ఎండ్ అయ్యాక రిలీజ్ చేస్తారు…

అతి కొద్ది సమయాల్లోనే అసలు సినిమా కలెక్షన్స్ ని అసలు రివీల్ చేయరు… రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద సినిమా వకీల్ సాబ్ విషయంలో కలెక్షన్స్ ఏ రోజువి ఆ రోజు రిలీజ్ చేయలేదు. దాని వెనక రీజన్స్ వాళ్ళకి ఉన్నాయి అది వేరే విషయం…

కానీ రన్ కంప్లీట్ అయ్యాక ఆల్ మోస్ట్ అందరికీ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ లు అందాయి. తర్వాత సెకెండ్ వేవ్ రావడం ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా లేటెస్ట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన పాగల్ సినిమా ఆడియన్స్ ముందుకు రాగా…

ఈ సినిమా కలెక్షన్స్ ని నైజాం, వైజాగ్ లాంటి మేజర్ ఏరియాల్లో బయటికి ఏమాత్రం రానివ్వడం లేదు… దాని వెనక కారణాలు ఏంటి అనేవి తెలియవు కానీ పెద్ద హీరో సినిమాలకు అంటే రికార్డుల విషయంలో ఇతర విషయాల్లో ఇలా చేస్తారు కానీ ఓ చిన్న సినిమా విషయంలో కలెక్షన్స్ రిలీజ్ చేయకుండా ఉండటం ఒక్క ఈ సినిమా విషయంలోనే జరిగింది ఇప్పటి వరకు.

వీకెండ్ తర్వాత సక్సెస్ మీట్ పెట్టి 2 రోజుల్లో 6.5 కోట్ల గ్రాస్ వచ్చిందని స్టేట్ మెంట్ ఇచ్చారు… కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఫస్ట్ డే 1.40 కోట్ల రేంజ్ షేర్ ని రెండో రోజు 1.3 కోట్ల రేంజ్ షేర్ ని సినిమా సొంతం చేసుకుందని టోటల్ గ్రాస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here