యంగ్ హీరో శ్రీ విష్ణు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ను ఎదురుకుంటూ ఉండగా బ్రోచేవారెవరురా సినిమా సూపర్ హిట్ తర్వాత మరో హిట్ కోసం ట్రై చేస్తున్నా కానీ బాక్ టు బాక్ 2 డిసాస్టర్ మూవీస్ తో నిరాశ పరిచాడు. ఇలాంటి టైం లో ఎంటర్ టైన్ మెంట్ బాట పట్టి చేసిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి…
రిలీజ్ అయిన మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ లభించింది. దాంతో ఓపెనింగ్స్ చాలా స్లోగా ఓపెన్ అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సాలిడ్ గ్రోత్ ని సాధించి దుమ్ము లేపింది. సినిమా ముందు ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి తెలుగు రాష్ట్రాలలో….
30 నుండి 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు అనుకున్నా సినిమా ఆ అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 57 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గ్రాస్ ఆల్ మోస్ట్ 95లక్షల నుండి 1 కోటి దాకా ఉండే ఛాన్స్ ఉంది.
ఇక ఓవర్సీస్ లో సినిమా 8 లక్షల మేర షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో షేర్ ని 1.1 కోట్ల దాకా గ్రాస్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుంది. ఇక సినిమా సాధించిన బిజినెస్ లెక్కలు ఏమి కూడా రిలీజ్ అవ్వలేదు.
వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తో సినిమా బిజినెస్ లెక్కలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ లు బయటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండో రోజు కూడా సినిమా మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న నేపధ్యంలో రాజ రాజ చోర మరో 40 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోవచ్చు. మరి 2 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.