Home న్యూస్ క్రేజీ అంకుల్స్ రివ్యూ…ఏంటి సామి ఇది!

క్రేజీ అంకుల్స్ రివ్యూ…ఏంటి సామి ఇది!

0

యాక్షన్ శ్రీముఖి హీరోయిన్ గా రాజా రవీంద్ర, సింగర్ మనో మరియు భరణి ముఖ్య పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ క్రేజీ అంకుల్స్… చిన్న సినిమానే అయినా కానీ రీసెంట్ టైం లో సోషల్ మీడియా లో తెగ మీమ్స్ తో పబ్లిసిటీ సొంతం చేసుకుని ఈ వీకెండ్ రిలీజ్ అయిన చాలా సినిమాలతో పోటిగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే.. పెళ్లై అనేక భారాల వలన చిన్న చిన్న సరదాలు కోల్పోయిన ముగ్గురు అంకుల్స్ ఉండే కాలనీలోకి సింగర్ అయిన శ్రీముఖి ఎంటర్ అవుతుంది, తర్వాత వీళ్ళు ఆమెని ట్రై చేయడానికి చేసిన ఎత్తులు పైఎత్తులు ఏంటి ఫైనల్ గా ఏమయ్యింది అన్నది సినిమా కథ.

కథగా చెప్పాలి అంటే అతి చిన్న స్టొరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా శ్రీముఖి కుర్రకారును ఆకట్టుకునేలా చేసిన కొన్ని సీన్స్ తప్ప ఏమాత్రం ఇంప్రెసివ్ గా అనిపించలేదు. లెంత్ 1 గంటా 40 నిమిషాల రేంజ్ లోనే ఉన్నా సినిమా ఆద్యంతం తెగ బోర్ కొట్టిస్తుంది. శ్రీముఖి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా…

కొన్ని సీన్స్ లో యూత్ ని కూడా మెప్పిస్తుంది. ఇక రాజ రవీంద్ర తన ఎక్స్ పీరియన్స్ తో ఆకట్టుకోగా, మనో కూడా పర్వాలేదు అనిపించగా భరణి కూడా ఆకట్టుకున్నాడు. చిన్న రోల్ లో పోసాని మరియు బండ్ల గణేష్ కూడా కొన్ని తలుక్కులు మెరిపించినా ఓవరాల్ గా ఇలాంటి కథలు ఆల్ రెడీ దశాబ్దాల క్రితమే తెలుగు లో వచ్చాయి. మరి మెప్పించాయి అని ఈ సినిమా కూడా మెప్పిస్తుంది అనుకుంటే…

సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక చతికిల బడింది, కొన్ని కొన్ని సీన్స్ మినహా ఓవరాల్ గా మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. యూత్ శ్రీముఖి కోసం అతి కష్టం మీద ఒకసారి చూసే ప్రయత్నం చేయోచ్చు, లేకపోతె OTT లో కొత్త గా రిలీజ్ అయిన సినిమాలను ఒక లుక్కేస్తే సరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here