ఎప్పుడూ కూడా హిట్స్ కొట్టడం అన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ పడకుండా యావరేజ్ అనిపించుకునే రేంజ్ సక్సెస్ లతో కూడా కెరీర్ ని లీడ్ చేసి తర్వాత వరుస సినిమాలతో జోరు చూపిన హీరోలు ఉన్నారు. అలాంటి హీరోలలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ముందు నిలిచే హీరో అని చెప్పాలి. కెరీర్ లో ప్రస్తుతం ఆల్ టైం హై లో ఉన్నప్పటికీ…
ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ల వలన సినిమాలను ఆడియన్స్ ముందుకు అనుకున్న రేంజ్ లో తీసుకు రాలేక పోతున్న అక్షయ్ కుమార్ ఏడాదిన్నరలో బాలీవుడ్ నుండి థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న అతి పెద్ద సినిమా కితాబుని బెల్ బాటం సినిమా తో…
సొంతం చేసుకుని ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ లభించగా ఇక జనాలు భారీగా థియేటర్స్ కి తిరిగి వచ్చి సినిమాను మంచి విజయాన్ని చేస్తారని అంతా అనుకున్నా 4 రోజుల వీకెండ్ లో 13 కోట్ల లోపు కలెక్షన్స్ ని…
మాత్రమె సొంతం చేసుకున్న ఈ సినిమా నిరాశనే మిగిలించింది. ఇక వర్కింగ్ డే లో మరో 2 కోట్ల లోపు కలెక్షన్స్ ని సాధించి మొత్తం మీద 15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో రన్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే ఇప్పుడు మారిన బిజినెస్ లెక్కల ప్రకారం అయినా 45 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అయినా సాధించాల్సి ఉంటుంది కానీ అలా జరిగే అవకాశం లేక పోవడం తో…. ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ వైజ్ ఫస్ట్ ఫ్లాఫ్ ను సోలో హీరోగా సొంతం చేసుకోబోతున్నాడు అక్షయ్ కుమార్….
2015 లో బ్రదర్స్ సినిమా తో ఫ్లాఫ్ ను అందుకోగా తర్వాత అదే ఇయర్ లో సింగ్ ఈజ్ బ్లింగ్ కూడా ఫ్లాఫ్ అయింది, తర్వాత మంచి సినిమాలతో జోరు చూపిన అక్షయ్ లాస్ట్ ఇయర్ లక్ష్మీ బాంబ్ ని డిజిటల్ లో రిలీజ్ చేయడంతో సేఫ్ అయినా ఇప్పుడు బెల్ బాటం తో హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ వైజ్ అంచనాలను అందుకోలేక పోయాడు. ఇక ఈ సినిమా విజయం సాధిస్తే తిరిగి తెరుకోవచ్చు అనుకున్న బాలీవుడ్ కూడా సినిమా రిజల్ట్ తో కుదేలయింది…