రీసెంట్ టైం లో ఏ సినిమా ప్రమోషన్స్ లో కూడా జరగనిది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ మరక్కర్ అరేబియా సముద్ర సింహం సినిమా విషయంలో జరిగింది. ఏ సినిమా కి అయినా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయని…. టికెట్స్ అన్నీ కూడా వెంట వెంటనే సోల్డ్ ఔట్ అయ్యాయని చెబుతూ ఉంటారు… కానీ ఈ సినిమా విషయంలో ఎవ్వరూ ఊహించని విధంగా మా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్…..
రూపంలోనే ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెబుతూ పోస్టర్స్ ని వదలడం అన్నది ట్రోల్ స్టఫ్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ పై తెగ ట్రోల్స్ కూడా పడ్డాయి. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ అనుకున్న రేంజ్ లో…
ఏమాత్రం లేదని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ ఏమి మొదటి రోజు ఇబ్బంది పెట్టలేదు. దాంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా అందులో కేరళలో సినిమా 6.7 కోట్ల గ్రాస్ ను అందుకుని పర్వాలేదు అనిపించిందట.
ఇక మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి కేరళలో ఈ సినిమా 14 కోట్ల గ్రాస్ ను, టోటల్ ఇండియా లో 16.2 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందట. ఇక తెలుగు లో 3 రోజుల్లో సినిమా అతి కష్టం మీద 22 లక్షల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 4 రోజుల్లో 19.8 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందని అంటున్నారు.
దాంతో టోటల్ గా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 36.22 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అన్నారు తీరా చూస్తె వీకెండ్ లో వచ్చింది ఇది అంటున్నారు ట్రేడ్ వర్గాలలో… సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కోసం భారీ ఆఫర్స్ వచ్చినా నో చెప్పగా థియేట్రికల్ రన్ లో సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఇప్పుడు.