బాక్స్ ఆఫీస్ దగ్గగ యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా నిరాశనే మిగిలించాయి. ఛలో సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టినా కానీ తర్వాత చేసిన సినిమాల్లు అంచనాలను అందుకోలేదు. అశ్వద్ధామ ఉన్ననతలో పర్వాలేదు అనిపించినా తర్వాత చేసిన సినిమాలు కూడా నిరాశ పరచగా రీసెంట్ గా వరుడు కావలెను సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగశౌర్య కి ఈ సినిమా టాక్ పర్వాలేదు అనిపించినా కానీ….
ఎందుకనో బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకోలేక పోయిన సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా, ఇదే టైం లో రిలీజ్ అవ్వాల్సిన లక్ష్య సినిమాను కొంచం లేట్ గా డీసెంట్ ప్రమోషన్స్ తో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
ఇక ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లెక్క ట్రేడ్ లో చక్కర్లు కొడుతుండగా సినిమాను నైజాం ఏరియాలో 2.3 కోట్ల రేటుకి, సీడెడ్ లో 1.2 కోట్ల రేటు కి, ఆంధ్ర రీజన్ లో 1.6 కోట్ల రేంజ్ రేటు కి అమ్మినట్లు, కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ ఉన్నట్లు సమాచారం.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా 5.1 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల మరో 45 లక్షల దాకా బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 5.55 కోట్ల రేంజ్ లో ఉండగా క్లీన్ హిట్ కోసం సినిమా 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా నైజాం ఏరియాలో….
150 థియేటర్స్ లో సీడెడ్ లో 75 థియేటర్స్ లో ఆంధ్ర రీజన్ లో 180 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా 405 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 600 లోపు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ సారి నాగశౌర్య కి హిట్ కొట్టి 3 ఏళ్ల నిరీక్షణకి బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.