యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్య బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాలయ్య అఖండ యుఫోరియాని తట్టుకుని నిలుస్తుందా లేదా అన్న డౌట్ ఉండేది కానీ సినిమా యుఫోరియా ముందు తల వంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క రెండో వారంలో కూడా అఖండ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా లక్ష్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
రెండో రోజు చేతులు ఎత్తేసింది. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 85 లక్షల షేర్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 75 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది, కానీ రెండో రోజు సినిమా ఏకంగా 45% వరకు డ్రాప్ అయ్యి 40 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్ గా 45 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. అందులో తెలుగు రాష్ట్రాలలో 1.15 కోట్ల షేర్ ని అందుకుంది. ఈ కలెక్షన్స్ తో సినిమా బిజినెస్ ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి, ఆదివారం ఊహకందని గ్రోత్ ని చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.