Home న్యూస్ సందీప్ కిషన్ రిలీజ్ చేసిన ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ గ్లాన్స్.. ఆకట్టుకుంటున్న వీడియో

సందీప్ కిషన్ రిలీజ్ చేసిన ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ గ్లాన్స్.. ఆకట్టుకుంటున్న వీడియో

0

వరుసపెట్టి విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్‌ కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ క్రమంలో తాజాగా ఈ రోజు ప్రముఖ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా ‘తీస్ మార్ ఖాన్’ గ్లాన్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు సందీప్ కిషన్. ఇక ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ త్రీ షేడ్స్‌లో అదరగొట్టనున్నారని తెలుస్తోంది. ఈ గ్లాన్స్ వీడియో ద్వారా సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని స్పష్టమవుతోంది.

ఈ సినిమాలో అది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. చిత్రం లోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

కాస్ట్: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్

సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ :  తిరుమల రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్.ఒ : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here