బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమాలు అన్నీ కూడా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను కొనసాగిస్తూ ఉన్నంతలో వేటి రేంజ్ లో అవి హోల్డ్ చేస్తున్నాయి అని చెప్పాలి. ముందుగా కొత్త మూవీ శ్యామ్ సింగ రాయ్ 5 వ రోజు లో ఎంటర్ అవ్వగా సినిమా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.
దాంతో ఈ రోజు సినిమా 90 లక్షల నుండి 1 కోటి రేంజ్ వసూళ్లు రాబట్టవచ్చు. ఇక పుష్ప సినిమా 12 వ రోజు లో ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి 30% వరకు డ్రాప్ అవ్వగా ఈ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని వరల్డ్ వైడ్ గా…
2 కోట్ల నుండి 2.5 కోట్ల మధ్యలో షేర్ ని అందుకోవచ్చు. ఇక 27 వ రోజులో అడుగు పెట్టిన అఖండ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 18-20 లక్షల మధ్యలో షేర్ ని అందుకోవచ్చు. మరి మూడు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క అంచనాలను అందుకుంటుందా లేక మించుతుందా లేదా తగ్గుతుందా చూడాలి ఇక.