టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో రానా దగ్గుబాటి కూడా ఒకరని చెప్పాలి… బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నా కానీ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చే రానా నేనే రాజు నేనే మంత్రి, ఘాజి లాంటి సినిమాలతో మంచి సక్సెస్ నే సొంతం చేసుకున్నా కానీ అరణ్య లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ కూడా పరిచాడు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రానా నటించిన…
ఓల్డ్ మూవీ 1945 రిలీజ్ అవ్వగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నిర్మాతతో అయిన కొన్ని మనస్పర్ధల కారణంగా సినిమా షూటింగ్ మధ్యలోనే సినిమా నుండి తప్పుకున్న రానా 1945 కి డబ్బింగ్ కూడా చెప్పలేదు… అసలు ఈ సినిమాకి నాకు ఎలాంటి సంభందం కూడా లేదు అంటూ…
పలు సందర్భాలలో చెప్పాడు రానా… దాంతో ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ కూడా హీరో ఈ సినిమా నుండి తప్పుకోవడంలో తప్పు లేదు అంటూ సినిమా అసలు ఏమాత్రం బాలేదని చెప్పారు… ఇక ఆర్ ఆర్ ఆర్ రాలేదు అన్న భాదలో ఉన్న…
కామన్ సినీ లవర్స్ అందరూ ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలను అస్సలు పట్టించుకోలేదు. 1945 మూవీ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో 350 వరకు థియేటర్స్ లో ఓవరాల్ గా రిలీజ్ అయిన ఈ సినిమాను అసలు జనాలు పట్టించుకోలేదు. దాంతో తొలిరోజే డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్, జనాలు లేక థియేటర్స్ లో షోలు ఆపేయడం లాంటివి కూడా జరిగాయి. మొత్తం మీద సినిమా…
తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా 4-5 లక్షల మధ్యలో షేర్ ని సొంతం చేసుకుందట, ఇక రెండో రోజు 4 లక్షలకు అటూ ఇటూగా కలెక్షన్స్ ని సాధించిందని, 2 రోజుల్లో 8-9 లక్షల మధ్యలో షేర్, 18 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుందని అంటున్నారు, ఈ రేంజ్ లో దెబ్బ కొట్టిన సినిమాకి ఆదివారం కనుక కలెక్షన్స్ రాకుంటే ఇక తేరుకోవడం కష్టమే అని చెప్పాలి.