ఈ సంక్రాంతికి భారీ పాన్ ఇండియా మూవీస్ తో సందడి నెక్స్ట్ లెవల్ లో ఉండాల్సింది కానీ అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బంగార్రాజు ఒక్కటే క్రేజీ మూవీగా మారగా ఆ సినిమా కి పోటి ఇవ్వడానికి రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి సినిమాలు రేసులో ఎంటర్ అయ్యాయి. వాటిలో రౌడీ బాయ్స్ సినిమా సూపర్ మచ్చి లు రెండూ కూడా 14న నే రిలీజ్ కాబోతున్నాయి.
వాటిలో రౌడీ బాయ్స్ సినిమా కి దిల్ రాజు అండతో సినిమా రేంజ్ కి మించి ఓవరాల్ బిజినెస్ జరిగింది అని చెప్పాలి. దిల్ రాజు తమ్ముడి కొడుకు అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా భారీగా బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
ఆల్ మోస్ట్ 11 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని 11.5 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాబోతున్న థియేటర్స్ కౌంట్ 390 వరకు ఉంది. అందులో నైజాంలో 163 థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా…
సీడెడ్ లో 65 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా ఆంధ్రలో 160 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 520 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు పెట్టినా ఎక్కడా కూడా టికెట్ సేల్స్ అనుకున్న విధంగా లేవు, దాంతో సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతుండగా…
పండగ టైం లో రిలీజ్ కాబట్టి టాక్ బాగుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, టాక్ ని బట్టి గ్రోత్ బాగుంటే ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కానీ ఈ మార్క్ ని అందుకోవాలి అన్నా టాక్ ఎంతో కొంత బెటర్ గా ఉండాల్సిన అవసరం ఉంది, మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక.