ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు తెలుగు లో కలెక్షన్స్ ఓపెనింగ్స్ కుమ్మేసినా కానీ హిందీ లో ఓపెన్ అయిన రోజు స్పైడర్ మాన్ నుండి పోటి వలన తక్కువ థియేటర్స్ దక్కగా అంతకన్నా ముందు అసలు హిందీ రిలీజ్ ఉంటుందో ఉండదో అన్న డౌట్స్ కూడా వచ్చాయి, ఇక రిలీజ్ రోజున సినిమా కోటి కోటిన్నర రేంజ్ లో ఓపెన్…
అవుతుంది అనుకుంటే ఫస్ట్ డే నే సింగిల్ స్క్రీన్స్ లో జోరు చూపించి 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత వారాల్లో పోటి ఉండటం తో లాంగ్ రన్ లో 35-40 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకుంటే సినిమా కి పోటి లో ఉన్న సినిమాలు…
కొన్ని తప్పుకోవడం కొన్ని చోట్ల థియేటర్స్ థార్డ్ వేవ్ వలన మూత బడ్డా కానీ మాస్ సెంటర్స్ లో జోరు చూపిస్తూ దూసుకు పోయిన పుష్ప సినిమా ఊహకందని కలెక్షన్స్ తో 35-40 అనుకుంటే ఏకంగా 80 దాటగా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయినా కానీ సినిమా జోరు తగ్గలేదు…
థియేటర్స్ మళ్ళీ రీ ఓపెన్ అవ్వడం సోషల్ మీడియా లో క్రికెటర్స్ ఇతర సెలబ్రిటీలు పుష్ప ను మరింత ప్రమోట్ చేయడంతో సినిమా కలెక్షన్స్ జోరు తగ్గకుండా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 45 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో హిందీ లో చారిత్రిక 100 కోట్ల మార్క్ ని అధిగమించి పుష్ప సినిమా ఊహకందని ఊచకోత కోసింది… మొదటి రోజు 3 కోట్లతో ఓపెన్ అయ్యి…
మొదటి రోజు మీద 33 రేట్లు అధికంగా వసూళ్ళు సొంతం చేసుకుని చరిత్ర తిరగరాసింది. ఈ టైం లో ఇలాంటి రేర్ ఫీట్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు…. ఇప్పటికీ పరుగును స్టడీగా ఉండటంతో లాంగ్ రన్ లో మరింత దూరం సినిమా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… పుష్ప 2 ఇప్పుడు బాలీవుడ్ లో వన్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.