యంగ్ హీరో నాగశౌర్య కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య ఏ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో అయితే కలిసి రాలేదు అనే చెప్పాలి. అప్పుడెప్పుడో ఛలో సినిమా తో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నా కానీ ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి ఫ్లాఫ్ మూవీస్ ని మూట గట్టుకుంటూ కెరీర్ ని కొనసాగిస్తూ ఉన్నాడు నాగశౌర్య… రీసెంట్ టైం లో వరుడు కావలెను అలాగే లక్ష్య….
అంటూ రెండు బాక్ టు బాక్ మూవీస్ ని తక్కువ గ్యాప్ తో రిలీజ్ చేయగా వరుడు కావలెను కొంచం బెటర్ గానే పెర్ఫార్మ్ చేసినా కానీ లక్ష్య మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ బజ్ ని కూడా క్రియేట్ చేయలేక పోయింది. దాంతో ఆ ఇంపాక్ట్….
సినిమా బాక్స్ ఆఫీస్ మీద చాలా గట్టిగా ఇంపాక్ట్ చూపెట్టగా మూడు రోజుల మొదటి వీకెండ్ లో 1.62 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా మిగిలిన టోటల్ రన్ మొత్తం మీద కేవలం మరో 23 లక్షల షేర్ ని మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఒకసారి సినిమా….
టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 62L
👉Ceeded: 25L
👉UA: 25L
👉East: 10L
👉West: 9L
👉Guntur: 12L
👉Krishna: 12L
👉Nellore: 8L
AP-TG Total:- 1.63CR(2.75CR~ Gross)
Ka+ROI: 10L
OS – 12L
Total WW: 1.85CR(3.15CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్….
సినిమా ను మొత్తం మీద 5.5 కోట్ల రేంజ్ రేటుకి బాక్స్ ఆఫీస్ దగ్గర అమ్మగా సినిమా 6 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా అందులో మూడో వంతు కూడా కలెక్ట్ చేయలేక ఏకంగా 4.15 కోట్ల లాస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ డిసాస్టర్ గా పరుగును ముగించింది ఈ సినిమా… దాంతో నాగశౌర్య ఖాతాలో మరో డిసాస్టర్ మూవీ గా నిలిచింది ఈ సినిమా…