బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ కలెక్షన్స్ పరంగా పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది… బయ్యర్లకి థియేటర్స్ ఓనర్స్ కి సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం అయ్యేలా చేసిన ఈ సినిమా పరుగు ఆల్ మోస్ట్ 60 రోజుల తర్వాత ముగియగా ఇక నెట్ ఫ్రీ గా థియేటర్ ఓనర్లు తమ ఇష్టం మేరకు షేర్స్ కోసం సినిమాను నడుపుకోవచ్చు అని వదిలేశారు….
అంటే ఇక మీదట వచ్చే షేర్ మొత్తం వాళ్ళకే సొంతం అవుతుంది, షేర్ కట్టాల్సిన అవసరం ఉండదు…. పరుగు ఆల్ మోస్ట్ ముగిసింది కాబట్టి ఆ షేర్ ఇక లెక్కలోకి రాదు… కొత్త సినిమాలు ఉంటే వాటిని వేసుకోవచ్చు లేదా ఈ సినిమాను మరింత కాలం రన్ చేసుకోవచ్చు…
ఎలాగూ కొత్త సినిమాలు ఏమి లేకపోవడంతో రిలీజ్ అయ్యి 10 వ వారంలో రన్ అవుతున్న అఖండ సినిమాను ఆల్ మోస్ట్ 70 థియేటర్స్ లో రన్ చేస్తున్నారు… 10 వ వారంలో ఈ మధ్య టైం లో ఇన్ని థియేటర్స్ ని హోల్డ్ చేయడం అఖండకే చెల్లింది అని చెప్పాలి. అది కూడా డిజిటల్ రిలీజ్ తర్వాత ఇది మాస్ రాంపేజ్ అనే చెప్పాలి.