బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవులతో అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకున్నా కానీ థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన జనాలు థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో రాక పోవడంతో కలెక్షన్స్ పరంగా స్లో అయిన బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సి వస్తుంది. నైజాంలో కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో ఉండి ఉంటే ఈ పాటికే లాభాలను సొంతం చేసుకునే ఈ సినిమా…
అక్కడ కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం వలన లాంగ్ రన్ లో కష్టపడాల్సి వస్తూ ఉండగా నాలుగో వీకెండ్ లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాగానే జోరు చూపించింది అని చెప్పాలి. సినిమా 23 వ రోజున 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంటే…
24 వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ వలన సినిమా 15 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 24 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 8.37Cr
👉Ceeded: 6.97Cr
👉UA: 5.29Cr
👉East: 4.19Cr
👉West: 2.91Cr
👉Guntur: 3.47Cr
👉Krishna: 2.28Cr
👉Nellore: 1.76Cr
AP-TG Total:- 35.24CR(57.50Cr~ Gross)
👉Ka+ROI: 1.82Cr
👉OS – 1.51Cr
Total WW: 38.57CR(64.90CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 రోజులు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 38.15 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 24 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 43 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంటే కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది…. మరి మిగిలిన రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.