మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. సినిమా ఓవరాల్ గా 24.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 1600 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొంచం లేట్ అవ్వడం వలన సినిమా…
అడ్వాన్స్ బుకింగ్స్ కొంచం లేట్ గా ఓపెన్ అయ్యాయి… దాంతో ఆ ఇంపాక్ట్ బుకింగ్స్ పై కూడా పడగా సినిమా కి ఆన్ లైన్ బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజు వరకు చూసుకుంటే ఓవరాల్ గా 12-15% వరకు మాత్రమే ఆన్ లైన్ బుకింగ్స్ జరిగాయి అని చెప్పాలి…
కానీ చాలా వరకు రవితేజ సినిమాలు ఆన్ లైన్ కన్నా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ టికెట్ కౌంటర్స్ దగ్గర సాలిడ్ గా సాగుతాయి. క్రాక్ సినిమా కి ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ రెండు చోట్లా సాలిడ్ గా బుకింగ్స్ జరిగాయి కానీ ఇప్పుడు బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వడం వలన…
ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఆఫ్ లైన్ టికెట్ కౌంటర్స్ దగ్గర రిలీజ్ రోజు షో షోకి కలెక్షన్స్ పరంగా జోరు చూపే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి రవితేజ ప్రీవియస్ మూవీస్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తె సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి….
కానీ దీనికి కూడా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎక్స్ లెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది, రవితేజ ప్రీవియస్ మూవీస్ కి టికెట్ హైక్స్ ఉండగా ఈ సారి టికెట్ రేట్లు ఆంధ్రలో నార్మల్ గానే ఉండటం తో సినిమా మొత్తం మీద ఎలాంటి కలెక్షన్స్ ని ఓపెనింగ్స్ లో సొంతం చేసుకుంటుందో చూడాలి. టాక్ బాగుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…..