Home న్యూస్ 10 రోజుల్లో టాలీవుడ్ కష్టాలు తీరనున్నాయి!

10 రోజుల్లో టాలీవుడ్ కష్టాలు తీరనున్నాయి!

0

లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టైం లో టికెట్ రేట్లని ఓ 6 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నాయో అలాంటి రేట్స్ కి తగ్గించిన ఆంధ్ర ప్రభుత్వం, అప్పటి నుండి ఇప్పటి వరకు టికెట్ రేట్స్ ని నార్మల్ చేయలేదు…. దాంతో పెద్ద సినిమాల రిలీజ్ లు ఈ ఇంపాక్ట్ వలన వేవ్ ల వలన ఆగిపోగూ రాగా ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో చొరవ తీసుకుని తనతో పాటు మహేష్ బాబు ప్రభాస్ లను….

వాళ్ళతో పాటు రాజమౌళి కొరటాల శివ లను నేడు ఆంధ్ర ప్రదేశ్ సిఎమ్ దగ్గరకు తీసుకువెళ్ళి జగన్ తో మీటింగ్ పెట్టగా అక్కడ దాదాపు ఇండస్ట్రీ కష్టాలు చాలా వరకు తొలగనున్నాయని సమాచారం. ఓ వారం 10 రోజుల్లో మునుపటి మాదిరిగా టికెట్ రేట్లు ఉండబోతున్నాయని మెగాస్టార్ గుడ్ న్యూస్ ని మీడియాతో పంచుకున్నారు…

ఇక సిఎమ్ జగన్ ఇండస్ట్రీని వైజాగ్ కి షిఫ్ట్ అవ్వాలని కోరుతూనే….అందరి రెమ్యునరేషన్లు కాకుండా 100 కోట్ల కి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కే పెద్ద సినిమాలకు అన్నింటికీ కూడా వారం రోజుల పాటు టికెట్ హైక్స్ ఎక్కువ ఉండేలా చూస్తాం అంటూ మాట కూడా ఇచ్చారు… దాంతో ఆ గుడ్ న్యూస్ ఇక ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here