సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది, ఒక పక్క సోషల్ మీడియా లో భారీగా సినిమా ను అందరు హీరోల ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ ఎక్కడా కూడా బుకింగ్స్ ఏమాత్రం జరగలేదు అనే చెప్పాలి. సినిమా మొదటి రోజే చాలా చోట్లా….
జనాలు లేక భారీగా షోలు సినిమా వి కాన్సిల్ అయ్యాయి. అదే టైం లో సోషల్ మీడియా లో సినిమా హాష్ టాగ్ ట్రెండ్ అవ్వడం విచార కరం అనే చెప్పాలి…. సినిమా కి ఇవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి అని చెప్పాలి…
మరో పక్క థియేటర్స్ లో అస్సలు జనాలు లేకుండా ఉండటం ఈ సినిమా విషయంలోనే జరగగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కృష్ణా ఏరియాలో 25 వేల షేర్ ని, నెల్లూరులో 15 వేల షేర్ ని, ఇలా అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ చాలా తక్కువగా సొంతం చేసుకుందని సమాచారం…
మొత్తం మీద ఫస్ట్ డే టోటల్ గ్రాస్ లెక్క 6 లక్షల రేంజ్ లో ఉంటుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం… మోహన్ బాబు పెర్ఫార్మెన్స్ కి అప్లాజ్ వచ్చినా కానీ అవి కలెక్షన్స్ రూపంలో మారక పోవడం విచారకరం, ఓ డిఫెరెంట్ అటెంప్ట్ గా తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ వైజ్ భారీగా నిరాశ పరిచింది అని చెప్పాలి.
దాంతో తేరుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి శని ఆది వారాల్లో సినిమా రెట్టించిన జోరు చూపెట్టి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సినిమా ఎలాంటి ప్రదర్శన ని కొనసాగిస్తుంది…ఏమైనా గ్రోత్ చూపిస్తుందో చూడాలి ఇక…