టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న భీమ్లా నాయక్ సినిమా రీసెంట్ గా అఫీషియల్ ట్రైలర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్… కాగా సినిమా ట్రైలర్ పై ముందు ఉన్న అంచనాలు వేరు, కానీ రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ మినట్ లో ఎడిట్ చేసినట్లు సాదాసీదా ట్రైలర్ కట్ తో….
వచ్చిన భీమ్లా నాయక్ ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ భారీగా నిరాశ పరిచింది…. దానికి తోడూ లేట్ రిలీజ్ కూడా అయిన ఈ ట్రైలర్ లేట్ అయినా లేటెస్ట్ గా రికార్డుల దుమ్ము దులిపేసి ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ నుండి 8 లక్షల లైక్స్ దాకా అన్ని రికార్డుల బెండు తీయగా…
అప్పటికి నైట్ అవ్వడంతో ఫ్యాన్స్ స్లో అయిపోయారు… దాంతో తర్వాత అసలు రికార్డుల విషయంలో జోరు అనేది లేకుండా అయిపొయింది మార్నింగ్ నుండి అసలు సినిమాకి లైక్స్ అండ్ వ్యూస్ అస్సలు పెరగలేదు… దాంతో రికార్డ్ బ్రేకింగ్ స్టార్ట్ ను అలానే కొనసాగించలేక పోయారు ఫ్యాన్స్…. మొత్తం మీద 24 గంటల్లో…
కొత్త రికార్డులు కచ్చితంగా నమోదు అవుతాయి అనుకుంటే పాత రికార్డులు కూడా అందుకోలేక పోయారు. వ్యూస్ పరంగా అయితే సగానికి సగం దూరంలో ఆగిపోయి 24 గంటల్లో 11.83 మిలియన్ వ్యూస్ తోనే సరిపెట్టుకుని టాలీవుడ్ లో టాప్ 7 ప్లేస్ తో సద్దుకోవాల్సి వచ్చింది. ఇక లైక్స్ పరంగా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ రికార్డ్ కచ్చితంగా బ్రేక్ అయ్యి కొత్త రికార్డ్ నమోదు అవుతుంది అనుకుంటే….
అలా జరగలేదు…. మొత్తం మీద 24 గంటల్లో 1.11 మిలియన్ లైక్స్ తోనే సరిపెట్టుకున్న ట్రైలర్ టాప్ 2 ప్లేస్ ని సాధించింది…. ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ స్టార్ట్ ను అలానే కొనసాగించడంలో విఫలం అయ్యారు ఫ్యాన్స్… ఈ యూట్యూబ్ రికార్డులు ఎలా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భీమ్లా నాయక్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.. అక్కడ రచ్చ ఎలా ఉంటుందో చూడాలి ఇక…