Home గాసిప్స్ ఆ భారీ మూవీస్ ని పక్కకు పెట్టి సరికొత్త సినిమా చేస్తున్న మంచు విష్ణు!!

ఆ భారీ మూవీస్ ని పక్కకు పెట్టి సరికొత్త సినిమా చేస్తున్న మంచు విష్ణు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు కి కెరీర్ మొదట్లో హిట్స్ ఫ్లాఫ్స్ పడ్డా కానీ వరుస పెట్టి సినిమాలు వచ్చాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మంచు విష్ణు నుండి అలాంటి హిట్ రావడానికి చాలా టైం పట్టగా మధ్య లో దేనికైనా రెడీ మరియు దూసుకెల్తా లాంటి సినిమాలు మంచి రిజల్ట్ నే ఇచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర, తర్వాత రాజ్ తరుణ్ తో….

Mosagallu 3 Days Total World Wide Collection!!

చేసిన మల్టీ స్టారర్ మూవీ ఈడో రకం ఆడో రకం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది కానీ ఆ విజయాన్ని సరిగ్గా వాడుకోలేక పోయిన మంచు విష్ణు అప్పటి నుండి మళ్ళీ వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటూ వస్తుండగా రీసెంట్ గా…

తన నిర్మాణంలో భారీ బడ్జెట్ తో చేసిన… మోసగాళ్ళు భారీ డిసాస్టర్ గా నిలవగా నిర్మాతగా చేసిన సన్ ఆఫ్ ఇండియా కూడా భారీగా నిరాశ పరిచింది. ఇలాంటి టైం లో లాస్ట్ ఇయర్ మొదలు పెట్టిన ఢీ అండ్ ఢీ సినిమా తో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నారు అందరూ. ఈ సినిమా తో పాటు…

మంచు విష్ణు భక్త కన్నప్ప మరియు రావణ బ్రహ్మ లాంటి భారీ బడ్జెట్ సినిమాల ప్లానింగ్ లో ఉండగా ఈ మూడు సినిమాలు తన కెరీర్ ని తిరిగి ట్రాక్ ఎక్కిస్తాయి అన్న నమ్మకంతో ఉండగా ఇప్పుడు సడెన్ గా ఈ సినిమాలను పక్కకు పెట్టి, కొత్త డైరెక్టర్ ఈషాన్ సూర్య డైరెక్షన్ లో ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయబోతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు మంచు విష్ణు….

మంచు విష్ణు ఈసారి గాలి నాగేశ్వ‌ర‌రావు అనే ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ వ‌ర్క్ చేస్తున్నట్లు తెలియజేయగా ఈ సినిమా కథ నచ్చడం వలన ముందు ఈ సినిమా చేస్తున్నట్లు కన్ఫాం చేశారు… మరి ఈ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతారో కాదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here