బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ ఎక్స్ లెంట్ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది, సినిమా గ్లిమ్స్ నుండే విపరీతమైన అంచనాలను క్యారీ చేయగా, సాంగ్స్ కూడా కుమ్మేశాయి, ఇక ట్రైలర్ 1 కొంచం నిరాశ కలిగించినా ట్రైలర్ 2 కుమ్మేయడంతో అంచనాలు పెరిగి పోయాయి. ఇక సినిమా రిలీజ్ అయిన రోజున యునానిమస్ పాజిటివ్ రివ్యూలతో 3 స్టార్స్ నుండి 3.25 స్టార్స్ రేటింగ్స్ తో…
రిలీజ్ అయిన ఈ సినిమా కి ఇక కలెక్షన్స్ పరంగా ఆకాశమే హద్దుగా అందరూ భావించారు, ఆంధ్రలో లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ గట్టిగానే చూపినా కానీ ఓపెనింగ్స్ విషయంలో లోకల్ గా కానీ ఓవర్సీస్ లో కానీ సెన్సేషన్ ని క్రియేట్ చేసే ఓపెనింగ్స్ ని అందుకున్న భీమ్లా నాయక్….
ఎక్స్ లెంట్ వీకెండ్ కలెక్షన్స్ తర్వాత ఇక వర్కింగ్ డేస్ లో కూడా పోటి ఏమి లేక పోవడంతో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సాధిస్తుంది అని అంతా అనుకున్నారు, 4 వ రోజు కొంచం డ్రాప్స్ ఎక్కువ అయినా 5 వ రోజు శివరాత్రి హాలిడే సినిమాకి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చి భారీ కలెక్షన్స్ వచ్చేలా చేసింది…
కానీ 6 వ రోజు డ్రాప్స్ మళ్ళీ పెరగగా 7 వ రోజు కి వచ్చేసరికి డెఫిసిట్ లు, అంచనాలను మించి 75% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 8 వ రోజు మరోసారి హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, సూపర్ పాజిటివ్ టాక్, సాలిడ్ క్రేజ్, మంచి సాంగ్స్ ఇలా సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఉన్నా కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ వలనో,
ఫ్యామిలీ ఆడియన్స్ భారీ టికెట్ రేట్స్ వలనో థియేటర్స్ కి రాక పోవడం కావచ్చు కానీ ఇన్ని పాజిటివ్స్ ఉన్నా ఈ రేంజ్ డ్రాప్స్ రీసెంట్ టైం లో ఏ పెద్ద సినిమాకి కూడా జరగలేదు అనే చెప్పాలి. ఇక సినిమా కి ఇప్పుడు 9 మరియు 10 వ రోజులు అత్యంత కీలకం అనే చెప్పాలి, ఈ రోజుల్లో అంచనాలను మించి గ్రోత్ చూపక పొతే వచ్చే వారం రాధే శ్యామ్ వలన మరింత కష్టాల్లో సినిమా ఉండే అవకాశం ఉంది.