బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ రెండున్నర ఏళ్ల తర్వాత పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు నాలుగు రోజుల ముందే మొదలు అయినా కానీ సినిమా కి నైజాం లో బుకింగ్స్ ఓపెన్ అయినా కానీ ఆంధ్రలో టికెట్ హైక్స్ వచ్చినా కానీ పాన్ ఇండియా మూవీ….
అవ్వడంతో స్పెషల్ టికెట్ హైక్స్ ఇంకా ఎక్స్ ట్రా గా 10 రోజుల పాటు ఉంటాయి అని అనౌన్స్ చేయడం తో ఆ హైక్స్ పర్మీషన్ కోసం ఎదురు చూస్తూ ఉండటం తో ఆంధ్రలో బుకింగ్స్ రిలీజ్ రోజు కి ముందు రోజు ఈవినింగ్ టైం కి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి….
ఇక ఓవరాల్ బుకింగ్స్ విషయానికి వస్తే నైజాం లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోగా థియేటర్స్ కౌంట్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే తక్కువగా ఉండటం కొంచం ఇంపాక్ట్ చూపే అవకాశం ఉండగా ఆంధ్ర లో రిలీజ్ రోజు మార్నింగ్ షోల టైం కి బుకింగ్స్ సాలిడ్ గా దుమ్ము లేపే అవకాశం ఉంది…
ఇక ప్రెజెంట్ బుకింగ్స్ అండ్ సినిమా క్రేజ్ ను బట్టి చూస్తుంటే సినిమా ఓపెనింగ్స్ పరంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 28 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి రోజు సినిమా 30 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో బుకింగ్స్….
కొంచం లేట్ గానే ఓపెన్ అవ్వగా సినిమా మౌత్ టాక్ బాగుంటే అక్కడ షో షోకి కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా తొలి రోజు టాక్ బాగుంటే ఓపెనింగ్స్ పరంగా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఫస్ట్ డే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ రచ్చ చేస్తుందో చూడాలి…