రిలీజ్ అవ్వడం అతి తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అన్ని చోట్లా థియేటర్స్ కి జనాలు ఎగబడి వస్తూ ఉండటంతో రోజు రోజుకి స్క్రీన్ కౌంట్ ని విపరీతంగా పెంచుకుంటూ జనాలను భారీగా థియేటర్స్ కి రప్పిస్తున్న ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి అందరి నుండి అద్బుతమైన స్పందన లభిస్తుంది అని చెప్పాలి… అంతలా సినిమాలో ఏముందో తెలుసుకుందాం పదండీ…
ఎప్పటి నుండో కాశ్మీర్ లో స్థిరపడి ఉన్న కాశ్మీర్ పండిట్ లను అక్కడ నుండి పంపేసి కాశ్మీర్ ని తమ వశం చేసుకోవాలని చూసిన టెర్రరిస్ట్ లు చేసిన పండిట్ అయిన అనుపం ఖేర్ కొడుకుని దారుణంగా హత్య చేయగా తర్వాత తన కోడల్ని ఒక మనవడ్ని కూడా చంపేస్తారు… ఈ విషయం తెలియకుండా తన మరో మనవడిని పెంచిన అనుపం ఖేర్…
తను చనిపోయే సమయంలో తన హస్తికలను కాశ్మీర్ లో తన ఇంట్లో కలపమని అక్కడికి తన స్నేహితులను కూడా తీసుకు పోమని మనవడికి చెబుతాడు, కాలేజ్ లో ప్రొఫెసర్ చేసిన బ్రెయిన్ వాష్ తో కాశ్మీర్ లో జరిగిన తప్పులకు పండిట్ లదే తప్పు అనుకునే ఆ మనవడు తర్వాత ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు అన్నది సినిమా కథ….
1990 టైం లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటన ల ఆధారంగా వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కొంచం లెంత్ ఎక్కువ అయినట్లు అనిపించినా డాక్యుమెంటరీలా మనకు అనిపించినా కానీ మన కళ్ళముందు ఒక ఫ్యామిలీ ఇంత ఇబ్బంది పడుతుందా అని తెరపై అనుపం ఖేర్ పాత్రతో మనం రిలేట్ అయిపోతాం… ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ…
చివర్లో వచ్చే స్పీచ్ కానీ ఆ తర్వాత జరిగే మారణహోమం కానీ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది…. అనుపం ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది… సినిమా చూసిన తర్వాత కూడా కొంత టైం పాటు సినిమా మనతో ట్రావెల్ చేస్తుంది… రెగ్యులర్ మూవీ అయితే కాదు…. హార్డ్ హిట్టింగ్ స్క్రీన్ ప్లే ని తట్టుకోగల ఆడియన్స్ సినిమాను చూడొచ్చు…అనుపం ఖేర్ పెర్ఫార్మెన్స్ అయితే కచ్చితంగా చూసి తీరాల్సిందే…