Home న్యూస్ 338 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్…ఇక్కడ మాత్రం దెబ్బ పడిందిగా!!

338 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్…ఇక్కడ మాత్రం దెబ్బ పడిందిగా!!

0

కొన్ని కొన్ని సార్లు ఒక చోట సూపర్ సక్సెస్ అయిన సినిమాలు మరో చోట మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోతాయి. కొన్ని సినిమాలు వెండితెరపై ఆదరగోట్టినా కానీ బుల్లితెరపై మాత్రం నిరాశ కలిగించే టి.ఆర్.పి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలు డిజిటల్ లో హవా చూపి మిగిలిన చోట్ల స్లో అవుతాయి. కానీ థియేటర్స్ లో జోరు చూపించిన సినిమాలు డిజిటల్ లో కూడా అద్బుతాలు సృష్టిస్తాయి….

కానీ లేటెస్ట్ గా వచ్చిన ఓ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్స్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ డిజిటల్ లో మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ చూపెట్టలేక పోయింది. ఆ సినిమానే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా.. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే టైం లో…

అసలు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూయించిన ఈ సినిమా లాంగ్ రన్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కేవలం 10 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఏకంగా 338 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా అందులో ఇండియాలోనే…

సినిమా ఏకంగా 251 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సృష్టించింది. అలాంటి అద్బుతాలు సృష్టించిన ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ అవుతుంది అంటే చూడని వాళ్ళు కూడా ఇంకా ఎగబడి చూస్తారు అనుకుని జీ 5 లో సినిమాను సౌత్ భాషల్లో డబ్ చేసి మరీ రిలీజ్ చేశారు మేకర్స్… కానీ ఇక్కడకి వచ్చే సరికి సినిమా కి ఏమాత్రం వ్యూవర్ షిప్…

అనుకున్న రేంజ్ లో సొంతం అవ్వడం లేదని చాలా తక్కువ వ్యూవర్ షిప్ సొంతం అయ్యిందని అంటున్నారు, దానికి తోడూ ఆర్ ఆర్ ఆర్ కూడా డిజిటల్ రిలీజ్ జీ5 లోనే అవ్వడం కూడా ఈ సినిమాకి ఎదురుదెబ్బ కొట్టింది అంటున్నారు, అన్నీ కలిపి ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతాపం చూపినా డిజిటల్ లో మట్టుకు నిరాశ పరిచింది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here