బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ పై అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ కూడా ఆ అంచనాలను అందుకునేలా సినిమా టాక్ రాక పోవడం, వీకెండ్ తర్వాత కూడా భారీ టికెట్ హైక్స్ ని తగ్గించక పోవడంతో జనాలు థియేటర్స్ కి వెళ్ళడం లేదు, దాంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పై ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చూపింది అన్న దానికి….
ఇదే నిదర్శనం అని చెప్పాలి. రాధే శ్యామ్ సినిమా కి రీసెంట్ టైం లో మీడియం టు బిగ్ బడ్జెట్ మూవీస్ లో 4వ రోజు కలెక్షన్స్ పరంగా లోవేస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మిగిలిన సినిమాల బడ్జెట్ లతో పోల్చితే ఏకంగా 300 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో…
రూపొందిన రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ పేరిట ఇలాంటి కలెక్షన్స్ రికార్డ్ చేరడం ఇప్పుడు ట్రేడ్ ని కూడా విస్మయానికి గురి చేస్తుంది…. రీసెంట్ టైం లో రిలీజ్ అయిన మీడియం టు హై బడ్జెట్ మూవీస్ పరంగా 4 వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ను గమనిస్తే….
👉#Akhanda – 8.32Cr
👉#Pushpa – 6.92Cr
👉#BheemlaNayak – 5.18Cr
👉#VakeelSaab – 4.19Cr
👉#Bangarraju – 3.55Cr
👉#LoveStory – 2.52Cr
👉#RadheShyam – 2.11Cr****
ఇదీ రాధే శ్యామ్ సినిమా పరిస్థితి… లవ్ స్టొరీ లాస్ట్ ఇయర్ 50% ఆక్యుపెన్సీలో కూడా 4 వ రోజు వర్కింగ్ డే సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది…. అఖండ కి 4వ రోజు సండే రాగా 5 వ రోజు వర్కింగ్ డే కాగా ఆ రోజు సినిమా 3.58 కోట్లు కలెక్ట్ చేసింది…
కానీ 300 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ నాలుగో రోజు ఊహకందని రేంజ్ లో డ్రాప్ అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక 5 వ రోజు కూడా సినిమా హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకోవడంతో ఇక తేరుకునే అవకాశం లేనే లేదు అని చెప్పాలి… మొత్తం మీద రాధే శ్యామ్ దెబ్బ బాక్స్ ఆఫీస్ పై మాములుగా పడలేదు అనేది నిజం…