బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఈటీ తమిళ్ తో పాటు తెలుగు లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి తెలుగు లో అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ లాంటివి చేయక పోవడం అలాగే రిలీజ్ అయిన రెండో రోజే రాధే శ్యామ్ సినిమా ఉండటం తో సూర్య సినిమాను తెలుగు లో అసలు ఎవరూ…
పెద్దగా అయితే పట్టించుకోలేదు అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ తొలి రోజు కలెక్షన్స్ పై కూడా చాలా గట్టిగానే పడింది… దానికి తోడూ సినిమా టాక్ కూడా మిక్సుడ్ గానే రావడం తో ఇక సూర్య సినిమా తెలుగు లో తేరుకునే అవకాశం లేదని అందరూ అనుకున్నారు….
మొదటి వీకెండ్ కలెక్షన్స్ పరంగా కూడా ఇదే నిజం అయ్యింది, రాధే శ్యామ్ ఎఫెక్ట్ అండ్ టాక్ మిక్సుడ్ గా ఉండటం తో వీకెండ్ లో చాలా తక్కువ కలెక్షన్స్ నమోదు అవ్వగా తర్వాత మాత్రం రాధే శ్యామ్ టాక్ వర్కింగ్ డేస్ లో ఎఫెక్ట్ చూపగా మాస్ మూవీ అయిన ఈటీ జోరు చూపడం స్టార్ట్ చేసి…
మొదటి వారం మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో వీకెండ్ కూడా లిమిటెడ్ థియేటర్స్ లోనే 32 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది. ఒకసారి సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 98L
👉Ceeded: 51L
👉UA: 48L
👉East: 29L
👉West: 20L
👉Guntur: 26L
👉Krishna: 23L
👉Nellore: 15L
AP-TG Total:- 3.10CR(5.95CR~ Gross)
ఇదీ సినిమా 11 రోజుల్లో సొంతం చేసుకున్న కలెక్షన్స్ లెక్క… సినిమా ను తెలుగు లో 3.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 90 లక్షల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు టాక్ అండ్ కలెక్షన్స్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడం విశేషం అనే చెప్పాలి…