యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ రెండో వారంలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా 15 వ రోజు ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 16 వ రోజు లో…
అడుగు పెట్టిన సినిమా వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో ఈ రోజు మంచి గ్రోత్ తో పరుగును కొనసాగిస్తుంది. సినిమా ఆల్ మోస్ట్ 15 వ రోజు తో పోల్చితే 30-40% వరకు గ్రోత్ ని చూపించి పరుగును కొనసాగిస్తూ ఉండటం తో ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు…
ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు తెలుగు రాష్ట్రాలలో రోజు మొత్తం ఇదే రేంజ్ గ్రోత్ తో దూసుకు పొతే సినిమా 2.5 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక అన్ని చోట్లా లెక్కలు మించి పొతే……
సినిమా 3 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు, ఇక హిందీ లో ఈ రోజు ఎక్స్ లెంట్ గ్రోత్ ఉండగా ప్రజెంట్ గ్రోత్ ని బట్టి 6.5 కోట్ల రేంజ్ నుండి 7 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. మొత్తం మీద ఇండియాలో ఈ రోజు సినిమా 7.2 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు…
8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు 9 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ట్రెండ్ ని చూపిస్తే కలెక్షన్స్ జోరు ఇంకా బెటర్ గా ఉండొచ్చు. ఇక రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…