బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టార్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య కాంబినేషన్ ఏ రేంజ్ లో ఆసక్తిని రేపినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సాధిస్తూ ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. సినిమా రెండో రోజే లో కలెక్షన్స్ తో శాకివ్వగా మూడో రోజు కి వచ్చే సరికి….
బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత స్లో అయిన ఈ సినిమా పలు చోట్లా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడటం తీవ్రంగా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది అని చెప్పాలి. సినిమా ఏ దశలో కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకునేలా లేక పోవడం దానికి తోడూ ఇప్పుడు డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని…
సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ మరింత దెబ్బ పడుతున్నాయి. భారీ టికెట్ హైక్స్ వలన టాక్ ఎలా ఉన్నా చూడాలి అనుకున్న వాళ్ళు కూడా టికెట్ రేట్స్ చూసి థియేటర్స్ కి వెళ్ళడం లేదు. దాంతో సినిమా కలెక్షన్స్ డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ తర్వాత థియేటర్స్ రెంట్స్ కట్టగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పాలి.