బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ రెండు రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నప్పటికీ కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా గట్టిగానే హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 2వ రోజు లెవల్ లోనే ఓపెన్ అయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్….
సాలిడ్ గానే ఉండటంతో సినిమా ఈ రోజు మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, సినిమా మూడో రోజు ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా ఈ రోజు మరోసారి 3 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3.5 కోట్ల దాకా వెళ్ళే చాన్స్ ఉంది, ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ వైపు దూసుకు పోతున్న సినిమా మొత్తం మీద మరోసారి మంచి హోల్డ్ సొంతం చేసుకున్నా కానీ ఈ రోజు మినిమమ్ 5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే టార్గెట్ ని అందుకునే దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది.