నాచురల్ స్టార్ నాని మరియు నజ్రియాల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలలో మట్టుకు సినిమా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అయితే అందుకోవడం లేదు అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజు తో పోల్చితే….
6వ రోజు మరోసారి 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 6వ రోజు 30 లక్షల నుండి 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 6 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.