బాక్స్ ఆఫీస్ దగ్గర యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా అంచనాలను అందుకోలేదు, గోపీచంద్ నటించిన సినిమాల్లో చివరి సారిగా 2014 టైం లో వచ్చిన లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, కానీ తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేదు, కొన్ని మంచి సినిమాలు కూడా ఈ ఫ్లోలో ఫ్లాఫ్ అవ్వగా లాస్ట్ ఇయర్ గోపీచంద్ నటించిన….
సీటిమార్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ ఆ సినిమా తో కూడా హిట్ గీతని దాటలేదు. దాంతో ఆల్ మోస్ట్ 8 ఏళ్ళు అవుతున్న కానీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని అందుకొని గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ సినిమా గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి…
టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నిర్మించడం, మారుతి లాంటి మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ అంచనాలను అన్నీ కూడా మించిపోయింది అని చెప్పాలి ఇప్పుడు…. ఒకసారి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన…
ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను గమనిస్తే…
👉Nizam: 4Cr
👉Ceeded: 2Cr
👉Andhra: 7.50cr
AP-TG Total:- 13.50CR
👉Ka+ROI: 0.50Cr
👉OS – 1.20Cr
Total WW: 15.20CR
ఇదీ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా పక్కా కమర్షియల్ మూవీ సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు… గోపీచంద్ నటించిన సీటిమార్ సినిమా కి 11.50 కోట్ల బిజినెస్ జరిగింది. అప్పటి పరిస్తితులల్లో సినిమా ఆ బిజినెస్…
దగ్గరదాకా వచ్చి ఆగిపోయింది. మరి ఇప్పుడు సీటిమార్ ఆల్ మోస్ట్ హిట్ అవ్వాలి అంటే 16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్ టైం లో ఫామ్ లో లేకున్నా కానీ ఈ రేంజ్ లో బిజినెస్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ఎలా రికవరీ అవుతాయో చూడాలి.