ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ఆది పినిశెట్టి విలన్ గా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది వారియర్…. జులై 14న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై ట్రేడ్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉన్న సినిమాగా అందరూ భావిస్తున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు.
ట్రైలర్ చూసిన తర్వాత మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా సినిమా ట్రైలర్ ఉందని చెప్పాలి. ట్రైలర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో సినిమా కూడా అదే విధంగా ఉంటె బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ సినిమాతో 40 కోట్ల క్లబ్ లో చేరిన రామ్…
ఈ సినిమా తో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఎంతైనా ఉందనిపించే రేంజ్ మాస్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ కుమ్మేసింది. స్టొరీ పాయింట్ ప్రకారం కొంచం రొటీన్ గానే అనిపించినప్పటికీ కూడా, ఒక ఊరు…. ఆ ఊరిలో ఉండే ఒక విలన్…. తనని ఎదిరించడానికి….
ఆ ఊరికి వచ్చే హీరో… తర్వాత హీరో విలన్ ల గొడవ…. కమర్షియల్ మాస్ మూవీస్ లో ఉండే రెగ్యులర్ స్టొరీ పాయింట్ తోనే తెరకేక్కినప్పటికీ ఇక్కడ విలన్ గా ఆది పినిశెట్టి ఓ రేంజ్ లో రెచ్చిపోయి పవర్ ఫుల్ గా ఉండటంతో హీరో కూడా అదే రేంజ్ లో పవర్ ఫుల్ గా ఉండటంతో టగ్ ఆఫ్ వార్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని…
ట్రైలర్ చాలా వరకు ప్రూవ్ చేసేలా ఉంది, బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక్కటి మరీ సాంగ్స్ రేంజ్ లో లేదు కానీ ఓవరాల్ గా ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచింది, ముఖ్యంగా సినిమా సింగిల్ స్క్రీన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇక ట్రైలర్ తో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే ది వారియర్ కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.