Home న్యూస్ రాకెట్రి – ది నంబి ఎఫెక్ట్ రివ్యూ- ఎక్స్ లెంట్ మూవీ…మస్ట్ వాట్చ్!!

రాకెట్రి – ది నంబి ఎఫెక్ట్ రివ్యూ- ఎక్స్ లెంట్ మూవీ…మస్ట్ వాట్చ్!!

0

ఇండియన్ గ్రేటెస్ట్ శాస్త్రవేత్తలలో ముందు నిలిచే నంబి నారాయణన్ గారి లైఫ్ స్టొరీ తో కోలివుడ్ సీనియర్ యాక్టర్ ఆర్ మాధవన్ స్వీయ డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ రాకెట్రి ది నంబి ఎఫెక్ట్…. ఎప్పటి నుండో రిలీజ్ అవ్వాలని ట్రై చేస్తున్న ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది, మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ….

రాకెట్ సైన్స్ లో అత్యంత తెలివితేటలు కలిగిన నంబి నారాయణన్ కోర్సు కోసం విదేశాలకు వెళతాడు.. అక్కడ 2 ఏళ్ల కోర్సుని కేవలం 10 నెలల్లోనే పూర్తీ చేస్తాడు…. ఏకంగా నాసాలో అత్యంత భారీ సాలారీ ఆఫర్ చేసినా ఇండియా కోసం పనిచేయాలి అని ఇస్రోకి తిరిగి వచ్చి ఇక్కడ వసతులు అనుకూలంగా లేకున్నా ఇతర దేశాల హెల్ప్ తో….

ఇండియన్ రాకెట్ సైన్స్ ని డెవలప్ చేస్తున్న టైం లో అనుకోకుండా ఒకరోజు తన పై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ దాటాని పాకిస్తాన్ కి లీక్ చేశాడు అంటూ కేసు పెట్టి హింసిస్తారు… తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ….. నంబి నారాయణన్ గారి లైఫ్ స్టొరీని మాధవన్ ఎంతో భాగా పోషించారు…

ఆ పాత్రలో లీనం అయిపోయారు అని చెప్పాలి. ఇతర పాత్రల్లో నటించిన అందరూ మెప్పించాగా కొంచం డాక్యుమెంటరీలా అనిపించినా కానీ ఓ అద్బుతమైన శాస్త్రవేత్త లైఫ్ ఓ మచ్చ వలన ఎలా మారిపోయింది అన్నది హార్ట్ టచింగ్ గా చూపించారు…. అక్కడక్కడా కొంచం స్లో గా సినిమా నడిచినా కానీ మొత్తం మీద సినిమా చూసిన తర్వాత నంబి నారాయణన్ గారిపై గౌరవం పెరిగిపోవడం ఖాయం…

ఇక సౌత్ వర్షన్స్ లో సూర్య స్పెషల్ రోల్ చేయగా హిందీ లో షారుఖ్ స్పెషల్ రోల్ లో నటించారు, అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు…రీసెంట్ టైంలో వచ్చిన బయోపిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుస్తుంది ఈ సినిమా… ఓ రియల్ స్టొరీని చూడాలి అనుకున్న వాళ్ళు, రొటీన్ మూవీస్ బోర్ కొట్టిన వాళ్ళు ఈ వీకెండ్ రాకెట్రి సినిమా ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు… ఓవరాల్ గా ది మాస్ట్ వార్చ్ మూవీ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here