Home న్యూస్ గోపీచంద్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లక్ష్యంకి 17 ఏళ్ళు…4.6 కోట్ల బిజినెస్ కి ఊరమాస్ ప్రాఫిట్స్!

గోపీచంద్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లక్ష్యంకి 17 ఏళ్ళు…4.6 కోట్ల బిజినెస్ కి ఊరమాస్ ప్రాఫిట్స్!

0

యాక్షన్ హీరో గోపీచంద్(Gopichand) కెరీర్ ఇప్పుడంటే కొంచం స్లో డౌన్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్స్ పడటం లేదు కానీ ఒక టైం లో మాస్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తూ వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోయాడు గోపీచంద్. బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో విలన్ గా చేసి తర్వాత యజ్ఞం, రణం లాంటి సూపర్ హిట్స్ కొట్టిన గోపీచంద్…

తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లో జగపతిబాబు మరో హీరోగా ఇద్దరి కలయికలో మల్టీ స్టారర్ అనిపించేలా రూపొందిన సినిమా లక్ష్యం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అప్పట్లో స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది.

2007 లో జులై మొదటి వీక్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకు పోయి లాంగ్ రన్ లో అల్టిమేట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది. సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఆ టైం కి గోపీచంద్ మార్కెట్ లెక్కల్లో…

4.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లోపే ఆ కలెక్షన్స్ మొత్తాన్ని వెనక్కి రాబట్టి దుమ్ము లేపింది, ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 14.9 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం, అంటే పెట్టిన 4.6 కోట్ల రేటు కి 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా..

ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఏకంగా 9.9 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, స్టార్ హీరోలకి ఈ సినిమా పడి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ సినిమా అని అప్పట్లో ఈ సినిమా గురించి చెప్పుకునేవాళ్ళు, గోపీచంద్ కెరీర్ లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి….మార్కెట్ ని మరింత పెంచిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 17 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here