Home న్యూస్ మమ్మోత్ RRR రికార్డ్…జస్ట్ 9 రోజుల్లో బ్రేక్….రెబల్ స్టార్ రికార్డ్!

మమ్మోత్ RRR రికార్డ్…జస్ట్ 9 రోజుల్లో బ్రేక్….రెబల్ స్టార్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన మమ్మోత్ బ్లాక్ బస్టర్ RRR మూవీ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఊహకందని వసూళ్ళని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…అందులో కూడా నార్త్ అమెరికాలో…

అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆ సినిమా రీసెంట్ టైంలో బాహుబలి2(Baahubali2 Movie) తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. టోటల్ రన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ నార్త్ అమెరికాలో 14.28 మిలియన్ డాలర్స్ ను వసూల్ చేసింది….

ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన సినిమా, కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మూవీ అవ్వడంతో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నా కొత్త రికార్డులు ఓవర్సీస్ లో నమోదు చేయలేదు కానీ ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. అలాంటి ఆ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని..

   

జస్ట్ నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా అల్టిమేట్ రివ్యూలను సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

జస్ట్ 9 రోజులు పూర్తి అయ్యే టైంకి నార్త్ అమెరికాలో ఏకంగా 14.6 మిలియన్ డాలర్స్ ను అందుకుని మాస్ రచ్చ చేసింది సినిమా…దాంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ కలెక్ట్ చేసిన టోటల్ రన్ కలెక్షన్స్ ని జస్ట్ 9 రోజుల్లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు…

ఈ రేంజ్ లో రన్ ని అయితే ఎవ్వరూ కల్కి నుండి ఓవర్సీస్ లో ఎక్స్ పెర్ట్ చేయలేదు, సూపర్ పాజిటివ్ టాక్ ఉన్నా నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక సినిమా టోటల్ రన్ లో నార్త్ అమెరికాలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here