బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో ఎఫ్ 2 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సీక్వెల్ ఎఫ్ 3 పై మంచి అంచనాలు ఉండేవి, సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను మరీ సూపర్ గా అందుకోక పోయినా కానీ ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉన్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మ్యాజిక్ చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.
సినిమా అందుకోవాల్సిన టార్గెట్ మొదటి పార్ట్ కలెక్షన్స్ కన్నా చాలా తక్కువే అయినా కానీ ఆల్ రెడీ జనాలు భారీగా డబ్బులను పాన్ ఇండియా బిగ్ మూవీస్ కోసం ఖర్చు చేయడంతో ఈ సినిమా కోసం మళ్ళీ ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడలేదు… దాంతో ఆ ఇంపాక్ట్….
సినిమా కలెక్షన్స్ పై క్లియర్ గా పడగా కొన్ని ఏరియాలలో సినిమా బిజినెస్ ను వెనక్కి ఇచ్చేశారు. దాంతో అడ్జస్ట్ అయిన బిజినెస్ దృశ్యా చూసుకుంటే సినిమా ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని హిట్ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు…
👉Nizam: 18.85Cr
👉Ceeded: 6.70Cr
👉UA: 6.55Cr
👉East: 3.56Cr
👉West: 2.57Cr
👉Guntur: 3.42Cr
👉Krishna: 3.01Cr
👉Nellore: 1.85Cr
AP-TG Total:- 46.51CR(75.50CR~ Gross)
👉KA+ROI:- 3.15Cr
👉OS: 7.25Cr
Total WW:- 56.91CR(95.20CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమాను మొత్తం మీద…
కొన్ని ఏరియాలలో అడ్జస్ట్ అయిన బిజినెస్ వల్ల 57 కోట్ల టార్గెట్ కి సినిమా 56.91 కోట్ల షేర్ ని 95.20 కోట్ల రేంజ్ లో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తీ చేసుకుంది అని చెప్పాలి.