బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్ లో హాలీవుడ్ డబ్ మూవీ తోర్ లవ్ అండ్ థందర్ మూవీ కూడా ఒకటి… డబ్బింగ్ మూవీనే అయినా ఇండియాలో సాలిడ్ క్రేజ్ తో వచ్చిన ఈ సినిమా కథ పాయింట్ చాలా నార్మల్ గానే ఉంటుంది…. తానోస్ చనిపోయిన తర్వాత గార్దియన్స్ ఆఫ్ గెలాక్సీ టీంతో ఉండే తోర్ దేవతలని చంపే విలన్ కోసం ఆస్గార్డ్ కి రావాల్సి వస్తుంది.
కాన్సర్ తో చనిపోతున్న తన లవర్ జైన్ ఆస్గార్డ్ కి వచ్చి తోర్ ఫస్ట్ ఆయుధం హెల్ప్ తో పవర్ ఫుల్ గా మారినా తను మరింత వీక్ అవుతుంది…. దేవుళ్ళని చంపాలని వచ్చిన విలన్ ఆస్గార్డ్ పిల్లలను ఎలా కిడ్నాప్ చేస్తాడు…. తోర్ ఎలా ఆ విలన్ నుండి…
పిల్లలను కాపాడాడు అన్నది ఓవరాల్ గా స్టొరీ పాయింట్. కథ చాలా సింపుల్ గా ఉండగా సినిమాలో విజువల్స్ కూడా మరీ అద్బుతం అనిపించేలా ఏమి ఉండవు, కొంచం అక్కడక్కడా బోర్ కూడా కొడుతుంది సినిమా. అయినా కానీ కొన్ని సీన్స్ లో కామెడీ బాగుండటం, ఓవరాల్ గా విజువల్స్ ఆకట్టుకోవడం….
లాంటివి కలిసి వచ్చి ఓవరాల్ గా ఒకసారి టైం పాస్ కోసం చూడొచ్చు అనిపించేలా ఉంటుంది తోర్ లవ్ అండ్ థందర్ మూవీ…. అక్కడక్కడా కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాగా మెప్పిస్తాయి కానీ ఓవరాల్ గా ఒకసారి చూసే రేంజ్ లో ఉన్న సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…
రీసెంట్ టైం లో బాలీవుడ్ మూవీస్ ని మించిపోయే రేంజ్ లో ఈ సినిమా మొదటి రోజు ఇండియా లో 18.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, తెలుగు రాష్ట్రాలలో కోటికి పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది ఈ సినిమా. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.