బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోల సినిమాలకు ఫ్లాఫ్స్ కామన్ కానీ ఇలాంటి ఫ్లాఫ్స్ చాలా తక్కువ సందర్బాలలో మాత్రమే సొంతం అవుతూ ఉంటాయి. లేటెస్ట్ గా బాక్ టు బాక్ నాలుగు హిట్స్ కొట్టిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు సినిమా మొదటి ఆటకే ఔట్ రైట్ డిసాస్టర్ గా నిలిచి పోగా ఏ దశలో కూడా సినిమా ఇక తేరుకోలేక పోయింది…
అతి కష్టం మీద మొదటి వారాన్ని పూర్తీ చేసుకోబోతున్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ రెంట్స్ అండ్ మెయింటైనెన్స్ కి తగ్గ కలెక్షన్స్ కూడా సాధించలేని పరిస్థితి ఉండగా సినిమా పరిస్థితి చూసి నంద్యాలలో వెలుగోడు ఏరియాలో సినిమా టికెట్స్ పై ఆఫర్స్ ని పెట్టారు…
70 రూపాయల టికెట్ రేటు పెట్టి ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టె పరిస్థితి కొని తెచ్చుకుంది ఈ సినిమా. ఈ రేంజ్ లో టికెట్స్ ని ఫ్రీగా ఇచ్చే రేంజ్ డిసాస్టర్స్ టాలీవుడ్ లో చాలా అరుదుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలలో థాంక్ యు సినిమా ఒకటిగా చేరడం విచారకరం అని చెప్పాలి.