యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డిసాస్టరస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ హిందీలో మాత్రం ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి ఇప్పుడు. అక్కడ భారీ లెవల్ లో బాయికాట్ ట్రెండ్ జరిగినా కానీ సినిమా అవన్నీ తట్టుకుని కూడా మంచి కలెక్షన్స్ తోనే ఇప్పుడు వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది.
సినిమా హిందీలో ఆదివారం రోజున క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా శనివారంతో పోల్చితే 50 లక్షలు తక్కువ కలెక్షన్స్ ని సాధించి 3.75 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును స్టడీగానే సొంతం చేసుకుంటూ వెళుతుంది…
ఒకసారి సినిమా హిందీ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 5.75CR(1.25cr Preview)
👉Day 2 – 4.25CR
👉Day 3 – 3.75CR
Total :- 13.75CR(6.25Cr~ Share)
సినిమా నార్త్ ఇండియా వర్త్ బిజినెస్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే హిందీ వర్షన్ హిట్ అయ్యే చాన్స్ ఉంది, ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.