Home న్యూస్ బ్రహ్మాస్త్ర రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

బ్రహ్మాస్త్ర రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

0

బాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా బ్రహ్మాస్త్ర పార్ట్ 1… ఆల్ మోస్ట్ 400 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ భారీ లెవల్ లో ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా సినిమా పై ఉన్న అంచనాల రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించగలిగిందా లేదా తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

సృష్టిలో మంచిని కోరుకునే వారు ఉంటారు చెడును కోరుకునే వారు ఉంటారు…సృష్టిలో ఉన్న కొన్ని పురాతన శక్తులను కాపాడే అస్త్రాలు కొందరి వద్ద ఉండగా వాటి అన్నింటికీ అతి పెద్ద అస్త్రం బ్రహ్మాస్త్ర ఉంటుంది, ఆ అస్త్రాన్ని సొంతం చేసుకోవాలని శత్రువులు ఎదురు చూస్తూ ఉండగా ఆ బ్రహ్మాస్త్రంని కాపాడే బాధ్యత హీరో తీసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

లాజిక్స్ లాంటివి ఏమి పట్టించుకోకుండా ఓ విజువల్ వండర్ చూడాలి అనుకున్న వాళ్లకి బ్రహ్మాస్త్రం సినిమా నచ్చుతుంది, ఫస్టాఫ్ కథ ఆసక్తిగా సాగగా ప్రీ ఇంటర్వెల్ నుండి మంచి హై మూమెంట్స్ తో సాగే సినిమా సెకెండ్ ఆఫ్ లో కొంచం అక్కడక్కడా స్లో అయినా కథ చాలా ప్రిడిక్టబుల్ గా ఉన్నా కానీ ఈజేగా ఒకసారి చూసే విధంగా మెప్పించింది అని చెప్పాలి. రణబీర్ కపూర్ ఎప్పటిలానే తన యాక్టింగ్ తో మెప్పించాగా ఆలియా భట్ రోల్ కూడా పర్వాలేదు అనిపించగా…

నాగార్జున రోల్ కూడా బాగా మెప్పించింది, అమితాబ్ బచ్చన్ కూడా మెప్పించగా నెగటివ్ షేడ్స్ లో మౌనీ రాయ్ పర్వాలేదు అనిపించింది…. భారీ బడ్జెట్ తో భారీ విజువల్ వండర్ లా తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ విషయంలో గ్రాఫిక్స్ విషయంలో మాత్రం అంచనాలను ఓ రేంజ్ లో అందుకుంది అని చెప్పాలి. కానీ అదే టైం లో కథ పరంగా మాత్రం చాలా సింపుల్ స్టొరీ పాయింట్ అనిపించడం ఖాయం…

ఇక సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం లవ్ స్టొరీ వీక్ గా ఉండటం, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం లాంటి మేజర్ మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా సినిమాలో విజువల్స్, అద్బుతమైన గ్రాఫిక్స్ హంగులు సినిమా ఎండ్ అయ్యే వరకు కుర్చీలో కూర్చోబెడతాయి….. ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా మెప్పిస్తుంది ఈ సినిమా… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్… కంటెంట్ పరంగా అయితే 2.5 అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here