బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ నడుమ బరిలోకి రిలీజ్ అయిన సినిమా బ్రహ్మాస్త్ర… సౌత్ భాషల్లో కూడా డబ్ అయిన ఈ సినిమా కి హిందీ తర్వాత తెలుగు లో మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి. ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు లో సినిమాను ప్రమోట్ చేయడం, ఎన్టీఆర్ తో తెలుగు ప్రమోషన్స్ ని చేయించడంతో బజ్ పెరిగిన…
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా కొనసాగగా రిలీజ్ కి ముందు రోజు ఒక్క హైదరాబాదులోనే తెలుగు అండ్ హిందీ కలిపి 1.8 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ని అందుకుంది.
ఇక సినిమా తెలుగు బిజినెస్ ను ముందుగా గమనిస్తే… రాజమౌళి ఎంతకు కొన్నారు అన్న డీటైల్స్ ఏమి క్లియర్ గా బయటికి రాలేదు కానీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల బిజినెస్ వాల్యూ 5 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఏరియాల వారి వాల్యూ బిజినెస్ లెక్క ఈ విధంగా ఉంటుందని సమాచారం…
👉Nizam: 1.8Cr
👉Ceeded: 0.8Cr
👉Andhra: 2.4Cr
AP-TG Total:- 5.00CR
ఈ రేంజ్ లో తెలుగు వాల్యూ బిజినెస్ ఉంటుందని అంచనా.. దాంతో తెలుగు లో సినిమా హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా రిలీజ్ కి ముందు రోజే 2.5 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.8 కోట్లకు పైగానే షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 2 కోట్ల నుండి 2.2 కోట్ల దాకా షేర్ ని ఓపెనింగ్స్ రూపంలో సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఈ అంచనాలను కూడా మించుతుందో లేదో చూడాలి ఇక…